ప్రతి కుటుంబం ఒక మొక్క నాటి సంరక్షించాలి: ఏఎంసీ చైర్మన్ భూషణ్
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్ఆర్ఈజీఎస్ గ్రామపంచాయతీ నర్సరీలో పెంచిన మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూషణ్ మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి, వర్షపాతం పెరుగుదల, భూగర్భ జలాల సంరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏడీఏ సుజాత, కడెం ఎంపీడీఓ శ్రీనివాస్, పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్, మాజీ జెడ్పీటీసీ తక్కల రాధ సత్యనారాయణ, ఉప సర్పంచ్ తక్కల రమ్య రవీందర్, ఏఈఓ ఎండపల్లి అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఈజీఎస్ ఈఎఫ్ఏటీ రాజలింగం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
