ఇరాన్ – దక్షిణ ఇరాన్: బందర్ అబ్బాస్ నగరంలోని షాహిద్ రాజయీ ఓడరేవులో జరిగిన భారీ పేలుడులో 300 మంది గాయపడ్డారు. ఈ పోర్టులోని ఒక ఓడ నుంచి కంటైనర్ లు దిగుమతి చేస్తుండగా ఒక్కసారిగా ఈ కంటైనర్లు పేలిపోయాయి.. ఈ పేలుడు ప్రభావం ఒక కిలోమీటర్ వరకు పడింది.. పేలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు ఆ ప్రాంతన్ని కమ్మేశాయి.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసి మంటలను ఆర్పుతున్నాయి..
సహాయ బృందాలు రంగ ప్రవేశం చేసి అక్కడ ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ పేలుడు దాటికి ఒక కిలోమీటర్ల లోపు ఉన్న భవనాలలోని , కార్లలోని అద్దాలు పగిలిపోయాయి.. అనేక వందల మంది గాయపడ్డారు.. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చైనాలోని షాంఘై పోర్టు నుంచి వచ్చిన కంటైనర్లలో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. ఈ కంటైనర్లలో సోడియం పెర్క్క్లోరేట్ ఉందని వెల్లడించారు.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Containers Blast | ఇరాన్ ఓడరేవులో భారీ పేలుడు – 300 మందికి పైగా గాయాలు
