- అయ్యవారిపల్లిలో దారుణ ఘటన
- గొడ్డలితో గొంతు నరికి చంపిన భర్త
షాద్ నగర్, మార్చి 21, (ఆంధ్రప్రభ) : సంసార బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ భార్యను మద్యం డబ్బుల కోసం ప్రతినిత్యం ఇబ్బంది పెడుతున్న ఓ భర్త తాగడానికి డబ్బులు ఇవ్వకపోయేసరికి అతి దారుణంగా భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో రాత్రి చోటుచేసుకుంది. షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల పరుశురాములు తన భార్య జానమ్మను గొడ్డలితో గొంతు పైన నరికి చంపినట్లు తెలిపారు. సంసార బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ మద్యం డబ్బుల కోసం డిమాండు చేయగా.. ఆమె ఇవ్వలేదని భార్య జానమ్మను కోపంతో రాత్రి హతమార్చినట్టు చెప్పారు. జాను ముషవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించినట్లు తెలిపారు. భర్త పరుశురాములు కోసం పోలీసులు గాలిస్తున్నారు.