Arvind Kejriwal | E10, E20, E0 అందుబాటులో ఉంచాలి..

Arvind Kejriwal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంకులో E10, E20, E0 మూడు రకాల పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దేశంలో సుమారు 22 కోట్ల మోటార్‌సైకిళ్లు, 8 కోట్ల కార్లు ప్రస్తుతం E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేవని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో E20 పెట్రోల్‌ను బలవంతంగా అమలు చేస్తే కోట్లాది వాహనాలు క్రమంగా స్క్రాప్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వాహనదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పెట్రోల్ బంకులో E10, E20, E0 మూడు రకాల ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ సూచించారు. దీంతో ప్రజలు తమ వాహనాలకు అనుకూలమైన ఇంధనాన్ని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.