confused | రాపిడ్ ఫైర్‌లో దొర్లిన పొరపాటు

confused | రాపిడ్ ఫైర్‌లో దొర్లిన పొరపాటు

confused | బుమ్రాపై కామెంట్‌తో వైరల్ అయిన వీడియో
ఎన్టీఆర్ చెప్పిన ‘మతిమరుపు’ సీక్రెట్
సోషల్ మీడియాలో ట్రోల్స్ దాడి
హుందాగా క్షమాపణ చెప్పిన రామ్ చరణ్
వివాదాన్ని పాజిటివ్‌గా మార్చుకున్న మెగా హీరో

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఎంతటి స్టార్ సెలబ్రిటీలకైనా ఒక్కోసారి భారీ జనసందోహం ముందు మాట్లాడేటప్పుడు చిన్నపాటి తడబాటు, పొరపాట్లు రావడం సహజం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కూడా భోపాల్‌లో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన రాబోయే స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ మ్యూజిక్ లాంచ్ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

రాపిడ్ ఫైర్‌లో దొర్లిన పొరపాటు

భోపాల్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా హోస్ట్ రామ్ చరణ్‌తో ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ గేమ్ ఆడించారు. అందులో భాగంగా భారతీయ స్టార్ క్రికెటర్ల పేర్లు చెప్పి, వారి గురించి ఒక్క మాటలో చెప్పాల్సిందిగా కోరారు.

చరణ్ చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇస్తూ..
సచిన్ టెండూల్కర్: “లాంగ్, లెజెండరీ రన్”
ఎంఎస్ ధోని: “కామ్ అండ్ కూల్”
రోహిత్ శర్మ: “ఎవ్రీబడీస్ మ్యాన్”
విరాట్ కోహ్లీ: “ఫైర్” అని అభివర్ణించారు.

అయితే, చివరిగా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు అడిగినప్పుడు చరణ్ కాస్త గందరగోళానికి గురయ్యారు. బుమ్రాను ఉద్దేశిస్తూ.. “జస్‌ప్రీత్ బుమ్రా, నేను మీకు చాలా పెద్ద అభిమానిని. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. మీరు ఫుట్‌బాల్‌ను ఇంత ముందుకు తీసుకువెళ్తున్నారు.. లవ్ యూ సార్” అంటూ మాట్లాడారు.

క్రికెట్ ప్రపంచంలో టాప్ బౌలర్ అయిన బుమ్రాను, ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మీమ్స్ ఫెస్ట్‌కు దారితీసింది. ఇదే ఈవెంట్‌లో భోపాల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పొరపాటున ‘బీహార్ ప్రజలు’ అని అనడం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

confused
confused

ఎన్టీఆర్ చెప్పిన ‘మతిమరుపు’ సీక్రెట్..!

ట్రోలింగ్ నడుస్తున్న సమయంలోనే రామ్ చరణ్ అభిమానులు ఒక పాత విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళిలు.. రామ్ చరణ్‌కు పేర్లు, సందర్భాలు సరిగ్గా గుర్తుండవని, ఆయనకు కొంచెం మతిమరుపు అలవాటు ఉందని సరదాగా లీక్ చేశారు. ఇప్పుడు బుమ్రా విషయంలో జరిగింది కూడా అలాంటి పొరపాటేనని ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు.

వివాదానికి హుందాగా ముగింపు పలికిన మెగా హీరో

ఈ పొరపాటుపై సోషల్ మీడియాలో చర్చలు ముదరక ముందే రామ్ చరణ్ అత్యంత హుందాగా స్పందించారు. ఈవెంట్ ముగిసిన వెంటనే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బుమ్రాను ట్యాగ్ చేస్తూ క్షమాపణలు చెప్పారు.

“ఉఫ్.. పేర్ల విషయంలో నేను కొన్నిసార్లు నిజంగానే చాలా మతిమరుపుగా ప్రవర్తిస్తుంటాను. జస్‌ప్రీత్ బుమ్రాకి నా క్షమాపణలు. ఆ ఉత్సాహం, అంతమంది జనం మధ్యలో కేవలం సహజంగా జరిగిన చిన్న పొరపాటు మాత్రమే. మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. మీ ఆటకు నేను చాలా పెద్ద అభిమానిని. మీరు మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెడుతూ వికెట్లు తీస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.” అని పోస్ట్ చేశారు.

తాను చేసిన చిన్న తప్పును ఏమాత్రం ఈగోకు పోకుండా, వెంటనే ఒప్పుకుని బుమ్రాకు చరణ్ సారీ చెప్పిన తీరును ఇప్పుడు నెటిజన్లు, క్రికెట్ లవర్స్ అభినందిస్తున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా చరణ్ హుందాతనాన్ని చాటిచెప్పే పాజిటివ్ ట్రెండ్‌గా మారిపోయింది.

click here to read more

click here to read డిజిట‌ల్ వ‌రల్డ్‌లోకి.. మెగా ఎంట్రీ!