CmRevanthreddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన

CmRevanthreddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన
CmRevanthreddy | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. ఆపై కాళేశ్వరం ఆలయం నుంచి బయల్దేరి వెళ్లి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. తర్వాత బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సమీక్ష చేస్తారు. అక్కడినుంచి మేడిగడ్డ కాటారం మండలం నస్తురపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సభా వేదిక పైనుంచి సీఎం రేవంత్‌రెడ్డి ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.
