అవార్డు గ్రహీత మెస్రం జీజాబాయికి కలెక్టర్ సన్మానం..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : ఉల్లాస్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిర్పూర్ మండలానికి చెందిన మెస్రం జీజాబాయికి ‘బెస్ట్ లర్నర్ అవార్డు’ లభించింది.
అవార్డు గ్రహీత మెస్రం జీజాబాయిని శనివారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత శాలువాతో సన్మానించినట్లు సిర్పూర్ (యు) ఐకేపీ ఏపీఎం రమేష్ తెలిపారు.
ఉల్లాస్ కార్యక్రమంలో నిర్వహించిన పరీక్షలో జీజాబాయి ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ ఆమెను అభినందించినట్లు పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో డీఆర్‌డీఓ ఆశీర్వాద్, భానోద్ దత్తారాం పాల్గొన్నారు. సిర్పూర్ మండలం నుంచి బెస్ట్ లర్నర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఏపీఎం రమేష్ తెలిపారు. ఈ విజయం మండలానికి గుర్తింపు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.
