బీసీ కాలనీకి కృష్ణా జలాల సరఫరా..

బీసీ కాలనీకి కృష్ణా జలాల సరఫరా..

కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలంలోని చైతన్య నగర్ పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ కాలనీకి గత ఏడాది కాలంగా కృష్ణా జలాలు సరఫరా కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి సమస్యపై పలు వార్తాపత్రికల్లో బీసీ కాలనీలో దాహం కేకలు అనే శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ,ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తక్షణమే కృష్ణా జలాలను తాగునీటిగా అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, మంగళవారం నుంచి కాలనీలో కృష్ణా జలాల సరఫరా ప్రారంభించారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సిహెచ్.సాయిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, ఉపేంద్రల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. దీంతో బీసీ కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌కు,మండల పరిషత్ అధికారులకు, సంబంధిత శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply