పోలిశెట్టిపాడు ధర్మా ఇండియన్ ఫిల్లింగ్ స్టేషన్ను తనిఖీ..
పోలిశెట్టిపాడు ధర్మా ఇండియన్ ఫిల్లింగ్ స్టేషన్ను తనిఖీ..
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామ పరిధిలో ఉన్న ధర్మా ఇండియన్ ఫిల్లింగ్ స్టేషన్ను మంగళవారం ఆర్డీవో ఎ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పెట్రోల్ బంక్లో ఇంధన నిల్వలు, విక్రయ విధానం, కొలతల ప్రమాణాలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అక్రమాలు, కొరతలు చోటుచేసుకోకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని బంక్ యాజమాన్యానికి సూచించారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ధరల పట్టికలు, భద్రతా ప్రమాణాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. పెట్రోల్ బంక్లలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు.ఈ తనిఖీలో ఎం.ఆర్.ఐ. యు.దివ్య ప్రసాద్, సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
