ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత

ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత

బాసర (నిర్మల్ జిల్లా) : ఆంధ్ర‌ప్ర‌భ : బాసర ఆలయ క్షేత్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ జ్ఞాపికను అందజేశారు. అతిథి గృహంలో సీఎం రేవంత్ రెడ్డికి సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తన మనవడిని ఎత్తుకున్న ఫోటోను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించినట్లు సర్పంచ్ ఆంధ్రప్రభ కు తెలిపారు. సీఎం హామీ మేరకు త్వరలోనే నిధులు విడుదల చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ పేర్కొన్నారు.