ఆధ్యాత్మిక చింతనతోనే భక్తులకు మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే భక్తులకు మానసిక ప్రశాంతత
కుంటాల , ఆంధ్రప్రభ: ఆధ్యాత్మిక చింతానతోనే భక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీశ్రీశ్రీ కేదార్ నంద స్వామీజీ కందీశ్వరాలయం పలుగుట్ట భక్తులకు ప్రవచనాలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కుంటాల మున్నూరు కాపు సంఘంలోని శుక్రవారం రాత్రి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతానతోనే భక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సాల సందర్భంగా సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. భారతదేశానికి అతి ప్రాణం హిందు సంస్కృతి, హిందూ సమాజం అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే సమైక్యపరిచే మన దేశాన్ని విశ్వగురుగా చేయాలని లక్ష్యంలో ప్రతి ఒక్కరూ హిందూ సనాతధర్మంపై అడుగులు వేయాలని తెలిపారు. హిందూ ఐక్యతను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
సనాత ధర్మం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. భక్తిని ప్రతి ఒక్కరూ కొలుచుకోవాలని పిలుపునిచ్చారు. రోజువారిగా చేసే పూజలపై విశేషంగా భక్తులకు ప్రవచనంతో తెలిపారు. అదేవిధంగా హిందూ ధర్మంపై ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గోమాతను పూజించాలని తెలియజేశారు. కుంటాల ఉపఖండంలోని అంబకంటి తండా వెంకూర్ దౌనెల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులకు స్థానిక శివాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు పలు ప్రవచనాలతో సంస్కృతిక కార్యక్రమాలు అల్లరించాయి భక్తులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హరిచారి నారాయణ స్వామీజీ గురుమంచి చంద్రశేఖర్ శర్మ, సంజీవ్ శర్మ, వేద పండితులు సైతం భక్తులకు ప్రవచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్, స్థానిక నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు.

