kuntala | గావు పండుగ వేడుకలు ప్రారంభం..

kuntala | గావు పండుగ వేడుకలు ప్రారంభం..

ఊరు పొలమేరలలో కట్టు బంధనం..
రాకపోకలు నిలుపువేత..

kuntala, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి కుంటాల మండల కేంద్రంలోని శ్రీ ప్రసిద్ధ గజ్జలమ్మ దేవి ఆలయ ప్రాంగణంలోని శనివారం గావు పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్ జక్కుల గజేందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు గావు పండుగ వేడుకలను ప్రారంభించారు. గ్రామం సుభిష్టంగా ఉండాలని సుఖ సంతోషాలతో పిల్లాపాపలు సల్లంగా పాడి పంటలతో విరసిల్లాలని పాడిపంటలతో గ్రామం పై అరిష్టం తొలిగిపోవాలని అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గావు పండుగను నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా మండల కేంద్రమైన కుంటాలకు వచ్చే రహదారులను మూసివేశారు. ఆనవాయితీ ప్రకారం పొలమేరులలో కట్టు బంధం చేపట్టారు ఇతర గ్రామాల్లోని ప్రజలకు గ్రామానికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పొలిమేరలల్లోని ఆంక్షలు విధించారు.

భాజాభజంత్రీలతో పోతరాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాలు మండల కేంద్రమైన కుంటాలలోని గావు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం గావు పండుగకు సంబంధించిన ప్రత్యేక పూజలు తదుపరి అనంతరం ఇతర గ్రామాలకు చెందిన ప్రజలను గ్రామానికి అనుమతిస్తారు. అప్పటి వరకు కట్టుదిట్టమైన భద్రతను గ్రామ పొలిమేరల వద్ద కట్టుదిట్టమైన భద్రత నిర్వహించి అనంతరం రాకపోకలను మధ్యాహ్నం వేళలో పూజ అనంతరం అనుమతిస్తారు. ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో గావు పండుగ వేడుకలను ఎన్నో ఏళ్ల తర్వాత ఈ యొక్క గావు పండుగ వేడుకలను నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా పోతరాజులు శనివారం ఉదయం నుండే స్థానిక గజలమ్మ దేవి ఆలయంలోని పట్నం తోపాటు తదితర పూజా కార్యక్రమాలు ప్రారంభించి గ్రామ పొలిమేరల వద్ద పోతరాజులు కట్టు భద్రత ఏర్పరిచే పట్టారు. దీంతో మండల కేంద్రమైన కుంటాల లోని గావు పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply