మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి బీజేపీ నిరసన

పరకాల, ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టేనని బీజేపీ నాయకులు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పరకాల బస్టాండ్ సర్కిల్ వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ మహిళా వ్యతిరేక వైఖరి బయటపడిందని విమర్శించారు.

అలాగే, బీజేపీ పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అడ్డుకున్నది కేవలం బిల్లు మాత్రమే కాకుండా మహిళల ఆత్మగౌరవమని పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, మున్సిపల్ కౌన్సిలర్లు బేజ్జంకి పూర్ణాచారి, కుక్కల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, నాయకులు మెంతుల స్వప్నసురేష్, దంచనాదులు సత్యనారాయణ, మరేడుగొండ భాస్కరాచారి, ముత్యాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply