విజయవంతంగా వార్డు సభ నిర్వహణ
విజయవంతంగా వార్డు సభ నిర్వహణ
– డివిజన్-34లో తాగునీటిపై పలు ఫిర్యాదులు
కరీమాబాద్, ఆంధ్రప్రభ, :
గ్రేటర్ వరంగల్ శివనగర్ డివిజన్-34 పరిధిలోని భూపేష్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి పుష్పలత, వార్డు అధికారి వంశీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజు, మాజీ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, కొయ్యాడ ప్రభాకర్, అక్షిత్ పటేల్, మహిళా నాయకురాలు లావణ్య తదితరులు హాజరయ్యారు.
సభలో వర్షాకాల సన్నద్ధత, తాగునీటి సరఫరా, కాలువల శుభ్రత, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం తదితర ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజల నుంచి మొత్తం 9 వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలు, సూచనలు తెలియజేయడంతో వార్డు సభ విజయవంతంగా ముగిసింది.
