ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : త్రివేణి సంగమం కాలేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శనివారం హెలికాప్టర్ ద్వారా కాలేశ్వరం చేరుకున్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీ శుభానంద దేవి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు ఉన్నారు.
