Regonda | ఇంటింటికీ డిప్యూటీ సీఎం శుభాకాంక్షల లేఖలు

Regonda | ఇంటింటికీ డిప్యూటీ సీఎం శుభాకాంక్షల లేఖలు
Regonda | రేగొండ, ఆంధ్రపభ : విద్యుత్ వినియోగదారులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. గృహ జ్యోతి లబ్ధిదారులకు, రైతులకు ప్రభుత్వం తరపున వచ్చిన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డీఈ పాపిరెడ్డి తెలిపారు. తమ పేరుతో నేరుగా డిప్యూటీ సీఎం నుంచి లేఖ రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, గ్రామ సర్పంచ్ స్వప్న తిరుపతి, ఏఈ రాజు, ఎల్ఐ రామచందర్, ఎల్ ఎం రజాక్, ఏఎల్ఎం శ్యామ్, సిబ్బంది రంజిత్, దేవేందర్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
