మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య జన్మదినోత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య జన్మదినోత్సవ వేడుకలు బుధవారం ఎంతో ఘనంగా జరిగాయి. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి శంకరయ్యను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు పాల్గొన్నారు. కాగా శంకరయ్య జన్మదినం సందర్భంగా ఆయనకు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.