మహిళా సర్పంచ్ గా కృష్ణవేణి..

మహిళా సర్పంచ్ గా కృష్ణవేణి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత 25 ఏండ్ల క్రితం మోత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ కి తొలి,చివరి మహిళా సర్పంచ్ గా పనిచేసిన కల్వల కృష్ణవేణి ఆంధ్రప్రభ ప్రతినిదితో మాట్లాడుతూ….మోత్కూర్ మున్సిపల్ మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మోత్కూర్ గ్రామపంచాయతీ గా ఏర్పడినప్పటి నుండి రాజకీయాల్లో ఆ నాడు ఎంతో మంది సీనియర్ నాయకులకు సర్పంచ్ పదవులు పొందే అవకాశం దక్కేది.60 ఏండ్ల మోత్కూర్ గ్రామపంచాయతీ చరిత్రలో నాడు మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడంతో దాదాపుగా పురుషులే సర్పంచ్ లుగా కొనసాగారు. రాజకీయాల్లో మహిళలకు సైతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడంతో 2001 లో మోత్కూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం కాస్త బి సి మహిళకు కేటాయించారు.

2001 లోనే టి ఆర్ ఎస్ ఉద్యమ పార్టీ ఆవిర్భావం తో నా భర్త తిరుమల్ రావ్ అప్పటి వరకు టి డి పి లో కొనసాగగా…అనంతరం టి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ నేపథ్యంలో టి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా, ఒక మహిళగా నాటి రోజుల్లో పోటీ చేసి గెలుపొందాను.5 ఏండ్లు మోత్కూర్ గ్రామపంచాయతీ కి తొలి మహిళా సర్పంచ్ గా పాలన కొనసాగించడం సంతోషాన్ని ఇచ్చింది. నా తర్వాత మళ్ళీ మహిళలకు సర్పంచ్ రిజర్వేషన్లు రాకపోవడంతో ఎవ్వరు కూడా మహిళలు సర్పంచ్ కాకపోవడం..2018 లో మోత్కూర్ మున్సిపాలిటీ గా ఏర్పడడంతో… మోత్కూర్ కి తొలి, చివరి మహిళా సర్పంచ్ గా తానే కొనసాగడం ఒక రికార్డు మోత్కూర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవడంతో పాటు నా జీవితాంతం గుర్తుంటుంది.మోత్కూర్ ప్రజలకు,మహిళా లోకానికి ఎల్లవేళలా రుణపడి ఉంటా.మహిళలు మున్ముందు రాజకీయాల్లో కొనసాగుతూ ..తమదైన శైలిలో పురుషులకు దీటుగా పాలన కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా.

Leave a Reply