స్వామివారి మందిర నిర్మాణం కోసం..

స్వామివారి మందిర నిర్మాణం కోసం..

సూర్యాపేట జిల్లా ​గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం గ్రామం ఆధ్యాత్మిక చైతన్యానికి వేదికవుతోంది. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు భక్తుల సహకారంతో శరవేగంగా సాగుతున్నాయి. స్వామివారి మందిర నిర్మాణం కోసం గ్రామస్తులు, ముఖ్యంగా గౌడ కులస్తులు చూపుతున్న ఉదారత పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భక్తి తత్పరతతో తమ సంపాదనలో కొంత భాగాన్ని దైవ కార్యానికి కేటాయిస్తూ దాతలు విరాళాల వెల్లువ కురిపిస్తున్నారు.

​అక్షరాలా లక్షకు పైగా విరాళం అందజేసిన దాతలు ​ఈ నిర్మాణ క్రతువులో భాగంగా సోమవారం పలువురు దాతలు తమ ఆర్థిక సహకారాన్ని ఆలయ కమిటీకి సమర్పించారు. ​యమగాని కనకయ్య – సాయమ్మ దంపతులతో పాటు వారి కుమారులు సతీష్ భార్య హిందూవెంకటేష్ భార్య ప్రసన్నలు కలిసి రూ. 1,00,116/- విరాళంగా అందజేశారు. పెండెం వెంకయ్య – రామాంజమ్మ దంపతులు, వారి కుమారులు రాంబాబు, భార్య శ్రీలత, నాగరాజు భార్య సరితలు తమ వంతుగా రూ. 1,00,116/- రూపాయలను అందజేశారు. వట్టికూటి అంజయ్య ధర్మపత్ని శోభారాణి, వట్టికూటి వీరస్వామి, భార్య స్వాతి, నాగేశ్వరరావు భార్య కవిత, లక్ష్మీనారాయణ భార్య మమత 100116 రూపాయలు అందజేశారు.

​వట్టికూటవట్టికూటి మదారు – లక్ష్మమ్మ దంపతులు కుమారుడు నాగేంద్రబాబు భార్య త్రివేణి రూ. 52,116/- అందజేశారు. ​మామిడి సైదయ్య – తిరుమలమ్మ దంపతులు కుమారుడు వెంకటేశ్వర్లు భార్య తిరుపమ్మరూ. 50,116/- విరాళం అందజేశారు. ​విరాళాలు అందజేసిన ప్రతి కుటుంబానికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “గ్రామంలో ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించుకోవాలనే సంకల్పానికి గౌడ సోదరులంతా వెన్నుదన్నుగా నిలవడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరి సహకారం వల్లనే ఆలయ నిర్మాణం సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని విరాళాలు సేకరించి, అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు. ​ఆలయ అభివృద్ధికి మరిన్ని విరాళాలు అందించాలనుకునే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.