Municipal Result| ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

Municipal Result| ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

  • నాడు కాంగ్రెస్… నేడు బీఆర్ఎస్..
  • అధికార పార్టీలకు.. ప్రజల వ్యతిరేక తీర్పు..
  • కొండగడప 3,4 వార్డులలో చిత్రం భళారే.. విచిత్రం..

Municipal Result, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప 3,4 వార్డులలో చిత్రం భళారే.. విచిత్రంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా.. 3,4 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్డులు ఎర్రబెల్లి మల్లమ్మ యాదయ్య, లెంకల సుజాత వేణులు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ దఫా బీఆర్ఎస్ అభ్యర్థులు సుల్తాన్ స్వామి, కొండ శోభ సోoమల్లులు గెలుపొందారు. నాడు, నేడు కొండగడప ప్రజలు అధికార పార్టీలకు మాత్రం వ్యతిరేక తీర్పు.. ప్రతిపక్షాలకు అనుకూల తీర్పు ఇవ్వడంతో రాజకీయ విశ్లేషకులు అయోమయంలో పడ్డారు.

ఏది ఏమైనప్పటికీ.. కొండగడపలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు సాధించడంతో కొండగడప గులాబీ రంగుకి నిలయంగా మారింది. తొలిసారి 2014 లో ఎమ్మెల్యే గా పోటీ చేసిన గాధరి కిశోర్ కుమార్ సైతం ఇదే గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇక్కడి నుండి తన ప్రచార ర్యాలీ ప్రారంభించారు.

Leave a Reply