రోడ్డు ప్రమాదంలో బైకు దగ్దం.. ఒకరు మృతి..

రోడ్డు ప్రమాదంలో బైకు దగ్దం.. ఒకరు మృతి..


జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కాలేజీ గూడ (రాంనగర్) ప్రధాన రోడ్డుపై ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనానికి ఆటో ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా బైకు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండలంలోని బూసి మెట్ట గ్రామానికి చెందిన కాంబ్లే సాగర్ (32) మండల కేంద్రంలో పని నిమిత్తం వచ్చి ద్విచక్ర వాహనం పై తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అతను కిందపడగా వాహనం నుండి పెట్రోల్ లీకై ఆకస్మాత్తుగా మంటలు రావడంతో బైక్ తో పాటు సాగర్ శరీరం కాలిపోగా తలకుతీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ విషయం తెలియగానే పోలీసులు వచ్చి పరిశీలించి.. అనంతరం 108 కు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాల పాలైన సాగరకు మెరుగైన చికిత్సల కోసం ఉడ్నూర్ ఆసుపత్రికి తరలించినట్లు 108 రజినీకాంత్ పైలెట్ ఆడ అజయ్ తెలిపారు. సాగర్ ఉట్నూర్ ఆస్పత్రిలో చికిత్సల పొందుతూ మృతి చెందారని 108 రజినీకాంత్ తెలిపారు. సాగర్ తలకు తీవ్ర గాయాలు కావడం వల్లనే చనిపోయాడని ఈఎంటి తెలిపారు.

Leave a Reply