​చౌటుప్పల్‌లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో శనివారం అభిమానులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బండి సంజయ్ కుమార్ దీర్ఘాయుష్షుతో ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ నాయకులు కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఆయన కేంద్ర మంత్రిగా దేశానికి, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఉబ్బు బుచ్చయ్య, కడారి ఐలయ్య యాదవ్, గుండెబోయిన వేణు, బూత్ అధ్యక్షులు ప్రవీణ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.