ఎస్ ఐ ఆర్ ను వేగవంతంగా చేపట్టాలి
ఉరవకొండలోని 117, 118, 121 పోలింగ్ స్టేషన్ పరిధిలో
ఎస్ ఐ ఆర్ ను తనిఖీ చేసిన ఈ ఆర్ వో : మల్లికార్జున రెడ్డి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా వేగవంతంగా గడువులోగా పూర్తిచేయాలని ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మల్లికార్జున రెడ్డి సూచించారు. శనివారం ఉరవకొండ పట్టణంలోని 117, 118,121 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ ఆర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 149 ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్ 2026 కార్యక్రమం ఇంటిటా సర్వే ఈనెల 14వ తేదీ వరకు కొనసాగు తుందన్నారు. ఇందులో భాగంగా 260 పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బి ఎల్ ఓ లు వారి పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతి ఇంటి నందు గల ఓటరుకు, ఈ ఎఫ్ ఫారం జారీ చేస్తారన్నారు.
బి ఎల్ వో నుండి ఎనుమరేషన్ ఫారం పొందిన ప్రతి ఓటరు వారి ఓటరు విరములు ఈ ఎఫ్ నందు పూరించి 1 పాస్ ఫోటో జత చేసి, బి ఎల్ వో లకు తిరిగి తప్పనిసరిగా అందచేసి రసీదు తీసుకోవాలన్నారు. అట్టి వాటిని బి ఎల్ వో లు వారి బి ఎల్ వో లాగిన్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. బి ఎల్ వో నుండి ఈ ఎఫ్ ఫారము తీసుకొన్న ఓటరు అట్టి ఈ ఎఫ్ ను తిరిగి బి ఎల్ వో లకు అందచేయని యెడల అట్టి వారి పేర్లు ఈనెల 21వ తేదీ ప్రచురించు డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ నందు వారి పేర్లు నమోదు కాదన్నారు.
డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల నందు పేరు లేని వారి నుండి ఓటరుగా నమోదు కొరకు ధరఖాస్థులు స్వీకరించబడును, తదుపరి విచారణ అనంతరం అర్హులను 22.09.2026 తారీఖున ప్రచురించుతుది. ఓటరు జాబితా లో నమోదు చేయబడును. ఓటరు వారి ఇంటి నుండే వారి ఎనుమరేషన్ ఫారం వివరములు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును తెలిపారు. ఈ ఎస్ ఐ ఆర్ -2026 కార్యక్రమము బి ఎల్ వో లు , పిఎస్ పరిధిలోని బూతు స్థాయి ఏజెంట్ లతో సమన్వయ పరుచుకొని నియోజకవర్గం నందు ఇప్పటికి మొత్తం 2, 26,187 ఓటర్లకు గాను 2,26,187 (100 శాతం ) ఓటర్లకు ఈ ఎఫ్ ఫారంలు జారీ చేశామన్నారు.
అట్టి వాటిని తిరిగి ఓటరు నుండి 1,90,173 ( 84.08 శాతం ) ఫారాలు స్వికరించి, బి ఎల్ వో యాప్ లో డిజిటలైషేషన్ చేశామన్నారు. 6, 227 డెత్, డబుల్ ఎంట్రీ ఓటర్ల ను గుర్తించి, బి ఎల్ వో యాప్ లో అప్లోడ్ చేసామన్నారు. ఓటర్లు, బి ఎల్ ఏ లు సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండ పట్టణంలోని 138 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ ఆర్ ను తహసిల్దార్ అరుణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ అశ్వత్థ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
