Vietnam-Boat-Capsize : ప్రమోద యాత్రలో.. పెను విషాదం..

Vietnam-Boat-Capsize : ప్రమోద యాత్రలో.. పెను విషాదం..

  • వియత్నాంలో బోటు బోల్తా
  • 9 మంది మృతి .. నలుగురు గల్లంతు
  • 23 మంది సురక్షితం
  • మృతుల్లో కడప వ్యక్తి.. బందరు మహిళ గుర్తింపు
  • కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందన

( ఆంధ్రప్రభ, హనోయ్​ ప్రతినిధి)

Vietnam-Boat-Capsize : వ్యాపార లక్ష్యాలను అధిగమించిన ఆనందంలో.. ఓ కంపెనీ ఏర్పాటు చేసిన విహారయాత్ర ఘోర విషాదంగా మారింది. ఏపీ తెలంగాణకు చెందిన 75 మంది వియత్నాంలో పర్యటిస్తున్న తరుణంలో.. అలల తాకిడితో.. ఓ బోటు తల్లకిందులు కాగా.. 32 మంది సముద్రంలో మునిగిపోయారు. వీరిలో ఇప్పటికి 18 మంది మృతి చెందినట్టు మీడియాలో ప్రచారం జరగుతోంది ఓ ప్రమోదం ప్రమాదంగా మారింది. కన్నీటి సంధంబ పొంగింది. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Vietnam-Boat-Capsize : ప్పీడ్​ బోటు బోల్తా

ఒక మొబైల్ కంపెనీ 250 మంది భారతీయ డిస్ట్రిబ్యూటర్ల బృందాన్ని వియత్నాంవిహారయాత్ర కు తీసుకువెళ్లింది. వియత్నాం కాలమానం ప్రకారం జూలై 11, 2026 న శనివారం ఉదయం సుమారు 10:30 గంటలకు వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో హోన్ మే రట్ న్గోయ్ వద్ద) సముద్రంలో అకస్మాత్తుగా భారీ అలలు, బలమైన గాలుల ధాటికి బోటు నియంత్రణ కోల్పోయి తలకిందులైంది. ప్రమాద సమయంలో ఈ బోటులో 32 మంది పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదంలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల పర్యాటకులే ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ భార్య జయశ్రీ కూడా చనిపోయారు. కిషోర్ ప్రస్తుతం అపస్మారక స్థితిలో (విషమంగా) ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన వియత్నాం కోస్ట్ గార్డ్, రెస్క్యూ సిబ్బంది 23 మందిని సురక్షితంగా రక్షించారు. ఏపీకి చెందిన మరో నలుగురు పర్యాటకులు గల్లంతవ్వడంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటనను వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించడానికి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
Vietnam-Boat-Capsize : పెను విషాదం

ఒక మొబైల్ కంపెనీ సాధించిన అమ్మకాల లక్ష్యాల ఆధారంగా భారతదేశం నలుమూలల నుండి 250 మంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు , డీలర్లను ఒక ప్రోత్సాహక రూపంలో వియత్నాం విహారయాత్రకు తీసుకెళ్లింది. ఈ టూర్‌లో 250 మంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్లలో 40 మంది తెలంగాణకు, 35 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు ఉన్నారు.ప్రమాదానికి గురైన గ్రూప్: మొత్తం 250 మందిలో, ఒక చిన్న బృందంగా విడిపోయి 32 మంది పర్యాటకులు ఫు క్వాక్ ద్వీపంలో స్థానిక ‘ఓషన్ పర్ల్ ఐలాండ్ కంపెనీ’కి చెందిన స్పీడ్‌బోటులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ ప్రతినిధులు, వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులు బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించడానికి మరియు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నారు.