చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడి కేంద్రాల పునాదులు..

చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడి కేంద్రాల పునాదులు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే
కౌన్సిలర్ జ్యోతి రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అందరివాడు కేంద్రాలే పునాదులని చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని 8వ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్‌వాడీ సూపర్ వైజర్ శోభారాణి మాట్లాడుతూ గర్భిణీలు, తల్లులు పిల్లలు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తల్లులకు, గర్భిణీలకు, బాలింతలకు వివరించారు.
పిల్లలు పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పిల్లల ఎదుగుదలకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అంగన్‌వాడీ టీచర్ కె. నిర్మల మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రీ-స్కూల్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు అంజమ్మ, పుష్ప, చిన్నారులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
