Hyd Police Transfers | 30 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం

పోలీస్ శాఖలో భారీ మార్పులు..

Hyd Police Transfers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. మొత్తం 30 మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాలకు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ శాఖలో పరిపాలనా అవసరాలు, విధుల సమర్థ నిర్వహణ దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ బదిలీలతో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో అధికారుల బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

బదిలీల వివరాలు..!

  1. గాంధీనగర్ ఎస్‌హెచ్‌వోగా సీహెచ్ సురేశ్‌బాబు
  2. ట్రాఫిక్ అడ్మిన్‌గా ఎన్. బోస్ కిరణ్
  3. సీఎం నివాస భద్రత విభాగానికి ఎం. మల్లేశం
  4. చిక్కడపల్లి ఎస్‌హెచ్‌వోగా ఎల్. మధుబాబు
  5. అత్తాపూర్ ఎస్‌హెచ్‌వోగా ఎ. సీతయ్య
  6. సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోగా కె. నాగేశ్వర్‌రావు
  7. సీసీఎస్‌ (డీడీ)కి టి. అశోక్‌కుమార్
  8. లాలాగూడ ఎస్‌హెచ్‌వోగా బి. రవికిరణ్
  9. సచివాలయ భద్రత విభాగానికి ఆర్. గోపి
  10. చాంద్రాయణగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఆర్. రవీందర్
  11. ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బి. సత్యనారాయణ
  12. మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా సి. శ్రీనివాస్
  13. స్పెషల్ బ్రాంచ్‌కు ఈ. జంగయ్య
  14. ఫలక్‌నుమా ఎస్‌హెచ్‌వోగా ఎం. అప్పలనాయుడు
  15. స్పెషల్ బ్రాంచ్‌కు ఎన్. శ్రేయ
  16. రాజేంద్రనగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా పి. నవీన్‌కుమార్
  17. సైబర్ క్రైమ్స్‌కు ఎం. సురేందర్
  18. బోరబండ ఎస్‌హెచ్‌వోగా బి. రవికుమార్
  19. ఐటీ సెల్‌కు ఎం. రామకృష్ణ
  20. పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఈ. జహంగీర్ యాదవ్
  21. స్పెషల్ బ్రాంచ్‌కు జి. హరీశ్
  22. బహదూర్‌పురా ఎస్‌హెచ్‌వోగా టి. శ్రీనాథ్‌రెడ్డి
  23. ఆర్‌జీఐఏ అవుట్‌పోస్ట్ ఎస్‌హెచ్‌వోగా బి. కిరణ్‌కుమార్
  24. సీఎస్‌డబ్ల్యూకు బి. మురళీధర్
  25. మాదన్నపేట ఎస్‌హెచ్‌వోగా ఎస్‌కే. ముజీబ్-ఉర్-రెహమాన్
  26. ట్రాఫిక్ అడ్మిన్‌గా పి. అంజనేయులు
  27. కాచిగూడ డీఐగా కె.ఎం. రాఘవేంద్ర
  28. గోషామహల్ టీటీఐగా ఎండీ. షకీర్ అలీ
  29. ఆదిబట్ల ఎస్‌హెచ్‌వోగా ఎస్. రమేష్
  30. మలక్‌పేట్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వోగా కె. ఆదిరెడ్డి