రైతుల పక్షాన నిరంతరం పోరాడి సమస్యల పై కృషి చేస్తా..
రైతుల పక్షాన నిరంతరం పోరాడి సమస్యల పై కృషి చేస్తా..
- రైతు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరూరి శ్రీను.
చిట్యాల, ఆంధ్రప్రభ : రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు కృషి చేస్తానని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అరూరి శ్రీను ఎంపికైనట్లు తెలిపారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు జరిగిన రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో శ్రీను రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఎంపిక చేసిన రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
