మానవత్వం పరిమలించే..
జీవితకాలం మంచంపై ఉన్న రోగికి…
ఆదరణ నిమిత్తం10వేలు ఆర్థిక సహాయం.
టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ.
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటుంటే హృదయం చలించిపోతున్నదని అటువంటి వారికి అండగా ఉంటూ తన సొంత నిధులతో ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు.సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని తాను ఎమ్మెల్యే తనయుడిగా కాకుండానే ప్రజలతో తాను ఒకడిగా ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వింటూనే వారికి తాను చేయవలసిన సహాయం చేస్తూనే, ప్రభుత్వం, ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకువస్తున్నారు.
వామ్భే కాలనీ ప్రాంతానికి చెందిన దాసరి సుధాకర్ ధీనగాథ చెప్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం విధించిన కర్ఫ్యూ సమయంలో జరిగిన కాల్పుల్లో బుల్లెట్ గాయానికి గురై గత 35 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో జీవనం సాగిస్తున్నారు. గత35 ఏళ్లుగా బుల్లెట్ గాయంతో మంచానికే పరిమితమై ఆర్ధిక, ఆరోగ్య, ఆహార ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నాడు. సుధాకర్‌కు అండగా ఉంటానని హామీ ఇస్తూనే బొండా సిద్ధార్థ 10వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ప్రస్తుతం వస్తున్న పించన్తో పాటు, ప్రభుత్వం అందించే సొంత ఇంటి కలను ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకొని వెళ్లి సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటువంటి సమస్యను తన దృష్టికి డివిజన్ క్లస్టర్ ఇంచార్జి కంచి ధన శేఖర్, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజులను బొండా సిద్ధార్థ అభినందించారు.
