Blood Donation | 106వసారి రక్తదానం చేసిన ఉజ్వల్
Blood Donation |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలకు జీవం పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మనేపల్లి ఎస్.ఉజ్వల్ అరుదైన ఘనత సాధించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఆయన 106వసారి రక్తదానం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై ఉన్న అభిమానంతో గత 25 ఏళ్లుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎందరో అవసరమైన వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడినట్లు అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది.
ఈ సందర్భంగా ఉజ్వల్ సేవలను అభినందిస్తూ అఖిల భారత చిరంజీవి యువత ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఉజ్వల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని ఆకాంక్షించింది.
