Banaganapalle | మూడు రోజుల తర్వాత బయటపడ్డ ఘటన

Banaganapalle | మూడు రోజుల తర్వాత బయటపడ్డ ఘటన

Banaganapalle | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త పరారవడంతో స్థానికంగా కలకలం రేగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామానికి చెందిన వెంకన్న తన భార్య వెంకట లక్ష్మమ్మ (60)ను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

మూడు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వెంకట లక్ష్మమ్మ రక్తపు మడుగులో శవమై కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.