సీజీఎఫ్ నిధులతో నిర్మించిన షాప్స్ కి వేలం పాట

సీజీఎఫ్ నిధులతో నిర్మించిన షాప్స్ కి వేలం పాట

  • కనూరి వారి వీధిలో షాపుల వేలానికి మంచి స్పందన
  • షాప్ నెం.16కు రూ.18 వేల అద్దె..
  • షాప్ నెం.17కు రూ.20 వేల నెలవారీ ఆదాయం

ఆంధ్రప్రభ, భవానిపురం : విజయవాడ-1 పరిధిలోని కనూరి వారి వీధిలో సీజీఎఫ్ నిధులతో నిర్మించిన షాప్ నెం.16, 17లకు శుక్రవారం తొలిసారిగా బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ప్రక్రియకు వ్యాపార వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. వేలంలో షాప్ నెం.16 నెలవారీ అద్దెగా రూ.18 వేల ధర పలకగా, షాప్ నెం.17కు రూ.20 వేల అద్దె ఖరారైంది. దీంతో ఆలయానికి, చౌల్ట్రీకి స్థిర ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బహిరంగ వేలం ప్రక్రియను శ్రీ దినవహి చౌల్ట్రీ కార్యనిర్వాహణాధికారి పజ్జూరి మోహనరావు పర్యవేక్షించారు. పారదర్శకంగా వేలం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సీజీఎఫ్ నిధులతో నిర్మించిన వాణిజ్య సముదాయాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఆదాయ వనరులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.