వైసీపీ భూతాన్ని బిరడాలో బిగించాం ..

వైసీపీ భూతాన్ని బిరడాలో బిగించాం ..

దాన్ని భూస్థాపితం చేయాలి
పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేయాలి
ఎన్నికల్లో శతశాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ, ఆంధ్రప్రభ : రాబోయే ఎన్నికల్లో శతశాతం విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంచార్జిల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ భూతాన్ని బిరడాలో బిగించాం… ఇక దాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలి అని వ్యాఖ్యానించారు.

పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఉమా స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసి, ప్రజలతో నిత్యం మమేకం కావాలని సూచించారు. క్లస్టర్ ఇంచార్జిలు తమ పరిధిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, నాయకత్వానికి నివేదికలు అందించాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం చేస్తూనే, వైసీపీ విష ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరిని చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు సద్వినియోగం చేసుకుని పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పార్టీ నేతలు, క్లస్టర్ ఇంచార్జిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Leave a Reply