Apartment | యువకుడి ఆత్మహత్య

Apartment | యువకుడి ఆత్మహత్య
Apartment | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
గచ్చిబౌలిలోని మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి (30)కి ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా అతడు పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుని, అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆత్మహత్యకు ముందు శ్రీ సాయి తన సోదరుడికి మెసేజ్ పంపినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెళ్లి వేడుకల కోసం సిద్ధమవుతున్న ఇంట్లో విషాదం నెలకొనడంతో పరిసరాల్లో కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
