Telangana | అనుమానాస్ప‌ద రీతిలో….

Telangana | అనుమానాస్ప‌ద రీతిలో….

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : అనుమానాస్ప‌ద రీతిలో తండ్రి, కుమార్తె స‌జీవ‌ద‌హ‌న‌మైన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో చోటుచేసుకుంది.

కడిపికొండ రాజీవ్‌ గృహకల్పలో అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు. మృతులను రాజశేఖర్‌ (54), రాజశ్రీ (24)గా గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున రాజశేఖర్‌ మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించి రాజశ్రీ కాపాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె కూడా మృతిచెందింది. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Leave a Reply