AP CM | ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా జరిగిన బాధ్యతల స్వీకారం

AP CM | ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా జరిగిన బాధ్యతల స్వీకారం

AP CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇవాళ ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించారు.

లోకేశ్‌తో పాటు టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు కూడా ఈ సందర్భంగా ప్రమాణం స్వీకారం చేశారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులతో కలిసి కార్యక్రమం వైభవంగా జరిగింది.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా లోకేశ్‌తో పాటు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాల దిశగా ఈ నియామకాలు కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు. టీడీపీ భవిష్యత్ నాయకత్వంలో లోకేశ్ పాత్ర మరింత బలపడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Leave a Reply