Grain lorrys | జాతీయ రహదారిపై నిలిచిన లారీలు
Grain lorrys | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ జాతీయ రహదారిపై ఉన్న రామన్నపూడి రైస్ మిల్లు వద్ద ధాన్యం లారీలు నిలిచిపోయాయి. దిగుమతి అవ్వక లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పదుల సంఖ్యలో రహదారిపై లారీలు నిలిచిపోయాయి. అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ మిల్లర్లు అందుకు సహకరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. వాతావరణ సూచన నేపథ్యంలో రైతులు హడావుడిగా యంత్రాలతో వరి కోతలు కోసి కాటాలు వేసి ధాన్యం బస్తాలను పిల్లలకు తరలిస్తే మిల్లర్లు కొనుగోలు కాటాలు వేసి ధాన్యం బస్తాలను పిల్లలకు తరలిస్తే మిల్లర్లు ధాన్యం తీసుకోవడంలో ఆలస్యం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.
