పూరి గుడిసె పై లారీ బోల్తా..

వృద్ధురాలు అక్కడికక్కడే మృతి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శివారులలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్న చెరువు కట్ట సమీప ప్రాంతంలో మహానంది వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనున్న గుడిసె పై పడింది. ఆ గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. నంద్యాల తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు అధిక లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై పడింది. గుడిసెలో నివసిస్తున్న పుల్లమ్మ డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జరిగింది. ఇతరాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

