భోజన సదుపాయాలపై మంత్రి ఫోకస్
భోజన సదుపాయాలపై మంత్రి ఫోకస్
సామాన్యులు.. త్రిదళ సైనికుల కోసం ఏర్పాట్లు పరిశీలన
(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సభకు తరలివచ్చే.. సామాన్య ప్రజలు, కూటమి కార్యకర్తలు, నేతల కోసం ఏర్పాటు చేసిన ఆహార (ఫుడ్ స్టాల్) సౌకర్యాలను ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy) స్వయంగా పరిశీలించారు. గురువారం నంద్యాల – కర్నూలు రోడ్డులో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను మంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
వివిధ రకాల వంటకాలు (Recipes), ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత, పంపిణీ విధానాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. సభకు వచ్చే ప్రజానీకం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. అందరికీ తగిన ఆహారం సమయానికి, పరిశుభ్రంగా అందించాలి, అని నిర్వాహకులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని పర్యటన (Prime Minister’s visit) లో పాల్గొనే వేలాదిమంది ప్రజల కోసం ఆహార ఏర్పాట్లు అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, ప్రతి ఫుడ్ స్టాల్ వద్ద తాగునీరు, వసతి, విశ్రాంతి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు.సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆతిథ్య సత్కారం – ఇది మన బాధ్యత అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

