కుటుంబ కలహాలతో మహిళ హత్య

కుటుంబ కలహాలతో మహిళ హత్య
ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీ పరిధి ముత్తగూడెంలో ఈ రోజు ఉదయాన్నే ఓ మహిళ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామానికి చెందిన మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలను అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ కు గత మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత ఏడాది నుంచి మహేష్–అఖిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు దగ్గర పంచాయితీ కూడా జరిగింది. దీంతో మహేష్ విడాకులకు అప్లై చేసి కోర్టు నుంచి విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
ఈ రోజు వెంకన్న కొడుకు మనోజ్, బావమరిది డోర్నకల్ మండలం (Dornakal Mandal) దేవునిసంకీస గ్రామానికి చెందిన యల్ది వెంకన్నలు కలిసి మహేష్ ఇంటికి వెళ్లారు. తన కుమార్తె అఖిలను భార్యగా అంగీకరించాలని అడగడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి వెనుదిరిగిన వ్యక్తులు ఇంటికి వెళ్లి మెటపోతుల వెంకన్న, మహేష్, యల్ది వెంకన్నలు రెండు ద్విచక్రవాహనాలు మీద వెళ్లి కల్లు గీసే కత్తులతో మహేష్ పై దాడి చేశారు.

మహేష్ కడుపులోవెనుక నుంచి కత్తితో పొడిచారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న కుమారున్ని చూసి తల్లి నాగమణి(50) అడ్డుపోగా ఆమె పై కూడా దాడి చేయడంతో అక్కడిక్కడే మరణించింది. స్థానికులు సహాయంలో మహేష్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్ హెచ్ వో సీఐ ఎం. రాజు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి విచారణ చేపడుతున్నారు.
