ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

10వ తరగతిలో 100% ఉత్తీర్ణత – వెన్నెనపూడి ZP స్కూల్ టీచర్లను అభినందించిన ఎమ్మెల్యే

గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషితో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

నందివాడ మండలం వెన్నెనపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యాపకులను అభినందించారు.

వెన్నెనపూడి ZP పాఠశాల హెచ్ఎం మాధవ్ కుమార్, ఉపాధ్యాయులు రాజేంద్రనగర్ లోని స్వగృహంలో ఎమ్మెల్యే రామును మంగళవారం ఉదయం కలిసి విద్యార్థులు సాధించిన 100% ఉత్తీర్ణతను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విజయానికి గుర్తుగా రూపొందించిన ప్రచార బోర్డును ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ‘మనబడి పిలుస్తుంది’ కార్యక్రమంలో 500 మార్కులు దాటిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు. వారి నుండి మరింత మంది స్ఫూర్తి పొందేలా మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ మరింతమంది చేరేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో స్కూళ్లకు కార్పొరేట్ హంగులు తెచ్చామని ,డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, మెరుగైన మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచినట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ, టీచర్ పోస్టుల భర్తీతో విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు ఈ స్ఫూర్తితో మరింతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చైతన్యం తెస్తామన్నారు.విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి 100% ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే రాము పునరుద్ఘటించారు.

ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, విశ్రాంత డివైఈవో వెంకటేశ్వరరావు , పరువులు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply