Success Celebration | రామ్ చరణ్ రేంజ్ మాములుగా లేదుగా!
Success Celebration | రామ్ చరణ్ రేంజ్ మాములుగా లేదుగా!
Success Celebration | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ‘పెద్ది’ సినిమా ఘన విజయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి విశేష ఆదరణ అందుకుంటున్న నేపథ్యంలో హీరో రామ్ చరణ్ లండన్ చేరుకున్నారు. అక్కడ నిర్వహించనున్న ప్రత్యేక సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అనంతరం ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
‘పెద్ది’ విజయోత్సవాల్లో భాగంగా లండన్‌లో అభిమానులతో సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. రామ్ చరణ్ ఈ ఈవెంట్ కి హాజరుకావడం, అభిమానులతో ముచ్చటించనునడంతో ఈవెంట్‌పై విదేశాల్లోని తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇక ‘పెద్ది’ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని విదేశాల్లోని అభిమానులతో కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో చిత్రబృందం ఈ ప్రత్యేక సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహిస్తోంది. లండన్‌లో రామ్ చరణ్‌కు లభించిన స్వాగతానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

