AIG Hospital | ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం

AIG Hospital | ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం

AIG Hospital | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కాటం వెంకటేశం అన్నారు. మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో ఏఐజి ఆస్పటల్(AIG Hospital) డాక్టర్ కులకర్ణి, డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు బృందం సౌజన్యంతో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఈ రోజు సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించారు.

సర్పంచ్ మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలు ఈ హెల్త్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు గుండె, లివర్, కిడ్నీ సంబంధిత స్కానింగ్‌లు(scans), వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పల యాదయ్య, చిలుకుల కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.