కోర్ట్ తీర్పు….కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు
కోర్ట్ తీర్పు….కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు
మోత్కూర్, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని, రిపోర్ట్ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావు పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేశ్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బయట పడిందన్నారు.కేసీఆర్, హరీష్ రావు లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి, ప్రజా ధనం లూటీ చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను అమలు చేయలేకే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారన్నారు.
ఇలాంటి తప్పుడు కమీషన్ లు, కేసులు వేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ గత రెండున్నర ఏండ్లు కాలం గడిపారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎప్పుడు అవకాశం వస్తే… అప్పుడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీను, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు కొండ సోoమల్లు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, మాజీ ఎంపీటీసీ పానుగుళ్ల విష్ణు, జిల్లా నాయకులు మర్రి అనిల్ కుమార్, దబ్బేటి శైలజ, నాయకులు గుంటి దేవా, యూత్ నాయకులు కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, బుషిపాక గణేష్, అన్నందాస్ విద్యాసాగర్, డాక్టర్ కోకభిక్షం, సింగిల్ విండో మాజీ డైరెక్టర్స్ సామ పద్మా రెడ్డి, మలిపెద్ది మల్లారెడ్డి, యువజన నాయకులు మొరిగాల శీను , తాటి లక్ష్మణ్, బందెల శీను, పంజాల మహేందర్, పోన్నెబోయిన మచ్చగిరి , యశ్వంత్, కూరెళ్ల రమేష్ ,చుక్క అశోక్ , దాసరి నరేష్ ,కల్వల శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
