హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
చిట్యాల, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో అన్ని వీధుల గుండా బైక్ ర్యాలీ చేపట్టారు. మొదటగా హనుమాన్ దేవాలయంలో జయంతి సందర్భంగా పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం భక్తులు, జై శ్రీరామ్, జై హనుమాన్ , అంటూ బైక్ ర్యాలీలలో, డీజే పాటలతో అన్ని పురవీధుల గుండా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
