ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోనిరామచంద్రపురంలో ఉపాధి హామీ ప్రదేశంలో, ఉపాధి హామీ కూలీలకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లు గ్రామ సర్పంచ్ గాజే హేమలత- అశోక్ పంపిణీ చేశారు. వేసవిలో మండుతున్న ఎండలతో కూలీలు ఉపశమనం పొందేందుకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరిపురం నర్సింగం కార్యదర్శి , వార్డ్ మెంబర్లు ,ప్రభాకర్ ,రమణ , కట్ల సరోజన, క్యాతం దేవేంద్ర, గంపల మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
