ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ ఐకెపి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తుండగా, మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డుపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
