Alcoholism | సంపూర్ణ మద్యపానం నిషేధం…

Alcoholism | సంపూర్ణ మద్యపానం నిషేధం…
Alcoholism | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్న రామన్ చర్ల గ్రామంలో నూతన పాలకవర్గం జరిపిన తొలి గ్రామసభ సమావేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం పై తీర్మానం చేశారు. ఇట్టి మద్యపాన నిషేధంపై గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో మద్యపానం నిషేధంపై చేసిన తీర్మానా కి మహిళలు పలు పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపిన్నారు.
మన గ్రామ అభివృద్ధిలో మొదటి గ్రామ సభలో పాలక వర్గం చేసిన తీర్మానం మన గ్రామలో మధ్యపాన నిషేధంను 1.2.2026 నుండి మన గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంటుందన్నారు.
నిబంధనలు .. మద్యం అమ్మిన వారికి 1 లక్ష రూపాయలు జరిమానా
అమ్ముతుండగా ఆధారాలతో సహా చూపించిన వారికి 10,000 బహుమతి ప్రకటించడం జరిగిందన్నారు.
అదే విధంగా మద్యపాన నిషేధ కమిటీ కూడా 15 మందితో వేసినట్లు గ్రామ సర్పంచ్ ఆజామ్ , ఉప సర్పంచ్ కంత్రి యాదగిరి, గ్రామ అభివృద్ధి పాలక మండలి, మద్యపానం నిషేధ కమిటీ గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. ఇప్పటికే మండలంలో మద్యపాన నిషేధం గ్రామంగా నారాయణపురం ఉండగా ప్రస్తుతం చిన్న రామన్ చర్ల , కోడవ టూర్ తో పాటుగా మరిన్నీ గ్రామాలు నిషేధం అమలుకు శ్రీకారం చుట్టానున్నాయని వెళ్లడించారు…
