1972 Toll Free | మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు

1972 Toll Free | మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు

  • మన్యంలో మాదక ద్రవ్యాలను మట్టు పెడదాం
  • చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ కుమార్‌
  • చింతూరులో అభ్యుదయ సైకిల్‌ యాత్ర
  • గంజాయి నిర్మూళనపై విస్కృత ప్రచారం

1972 Toll Free | చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ : గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలవరం జిల్లాలోని చింతూరు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో అభ్యుదయ సైకిల్‌ యాత్ర(Bicycle trip)ను నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని కల్లేరు జంక్షన్‌, టింబర్‌ డిపో నుంచి చింతూరు ప్రధాన సెంటర్‌ వరకు అభ్యుదయం సైకిల్‌ యాత్రను చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ ఆధ్వర్యంలో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఆటో యూనియన్‌ డ్రైవర్లు నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు అభ్యుదయం సైకిల్‌ ర్యాలీతో పాటు వాక్‌దాన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చింతూరు ప్రధాన సెంటర్‌లో విద్యార్ధుల మానవహారం ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, విద్యార్థులు, ప్రైవేట్‌, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చింతూరు ఏఎస్పీ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాలు వద్దు జీవితమే ముద్దు అనే నినాదం యువత ముందుకు సాగాలన్నారు.

1972 Toll Free |

మన్యంలో మాదకద్రవ్యాలను అందరం కలసి మట్టు పెడదామన్నారు. ఈ బృహుత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకి రావాలని పిలుపునిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్టృ వ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణకు 1972 టోల్‌ ఫ్రీ నెంబర్‌(1972 Toll Free Number) ఉందని ఆ నెంబర్‌కి సైతం సమాచారం ఇవ్వోచ్చన్నారు.

1972 Toll Free |

మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుందని, మత్తు పదార్థాల నియంత్రణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మధ్యకాలంలో అల్లూరి జిల్లా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుమారు 600 అవగాహాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్ధులకు వ్యాసరచన, వకృత్వం వంటి పోటీలు నిర్వహిస్తూ పాఠశాలల్లో సైతం అవగాహన కల్పించామన్నారు. అదే విధంగా సుమారు 40 వేల కేజీల గంజాయిని(40 thousand kg of marijuana) పట్టుకొని ఎన్డీపీఎస్‌ చట్టం ద్వారా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఏజేన్సీలో గంజాయి నిర్మూళన 80 శాతం వరకు తగ్గిందని ఈ తగ్గుదలలో పోలీసుల పాత్ర కీలకమని, ప్రశంసనీయమన్నారు.

1972 Toll Free |
1972 Toll Free |

ముఖ్యంగా మన్యంలో మారుమూల పల్లెల్లో, గ్రామాల్లోని ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామన్నారు. యువత నేడు అధిక సంఖ్యలో మాదక ద్రవ్యాల బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ మాయదారి మాదకద్రవ్యాల నివారణకు(prevention) ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు.

1972 Toll Free |

ఈ కార్యక్రమంలో చింతూరు సీఐ గోపాల్‌ క్రిష్ణ, ఎస్సై పేరూరి రమేష్‌, డిగ్రీ కళశాల ప్రి న్సిపాల్‌ రత్నమాణిక్యం, శ్రీ భాస్కర్‌ విద్యా నికేతన్‌ ప్రిన్సిపాల్‌ వేణు గోపాల్‌, రాజకీయ నాయకులు జహాంగీర్‌, ఆటో యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, వివిధ పాఠశాల విద్యార్ధులు, ఉద్యోగులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : ఎస్పీపై స‌స్పెన్ష‌న్ వేటు

CLICK HERE TO READ MORE :

Leave a Reply