కాకినాడ – ఇటీవల ఉగ్రవాదుల దాడికి గురైన పహాల్గామ్ ను జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఒకచేతిలో జాతీయ జెండాను, మరో చేతిలో జనసేన జెండాను పట్టుకుని భారత మాతకు జై అంటూ అంటూ అభివాదం చేశారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసినందుకు ప్రధాని మోదీని అయన అభినందించారు.. అలాగే స్థానికులను అడిగి ఉగ్రవాద దాడి విషయాలను తెలుసుకున్నారు.. ఈ పర్యటనలో ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు ఉన్నారు..
Janasena | పహాల్గామ్ లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటన….
