Accident| ఆయిల్ ట్యాంకర్ తో కారు ఢీ: ఐదుగురు దుర్మరణం

కాకినాడ: తూర్పు గోదావరిజిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

మృతులు కాకినాడ బీచ్‌ చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం వద్ద కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

మృతుల వివరాలు :-1.రేలంగి శివన్నారాయణ ( 40 )2. రేలంగి దేవి లలిత ( 34 )3. రేలింగి వర్షిత ( 13 )4. తీగిరెడ్డి శివ ( 30 )5. తీగ రెడ్డి సాన్వి ( 4 )క్షతగాత్రుల వివరాలు :-1. తీగి రెడ్డి భవాని ( 26 )2. రేలంగి హర్షిత ( 13 )

Leave a Reply